జూలపల్లి, మార్చి 31 : గ్రామాల్లో రహదారులపై తారు లేచి, కంకర తేలి, గుంతలు, పగుళ్లుపడి అధ్వానంగా మారుతున్నాయి. దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని వడ్కాపూర్-ధూళికట్ట, నాగులపల్లి-చీమలపేట, పెద్దాపూర్, తేలుకుంట, చీమలపేట, జూలపల్లి-అబ్బాపూర్ గ్రామాల మధ్య రోడ్డు మరమ్మతులకు నోచుకోకపోవడంతో శిథిలమైంది. రహదారులపై గుంతలు తప్పించుకుంటూ ఎదురెదురుగా వచ్చే వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. చీకట్లో రోడ్డు సక్రమంగా కనిపించక అవస్థలు పడుతున్నారు.