Villagers donate | జూలపల్లి, ఆగస్టు 29 : వర్షాలకు దెబ్బతిన్న రహదారిని బాగు చేయించాలని ఆ వార్డు సభ్యులు అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నారు. రోజులు గడుస్తున్నాఅధికారులు పట్టించుకోకపోవడంతో ఆ వార్డు యువకులు ప్రజలంతా ఏకమై ముందుకు వచ్చారు. ఈ క్రమంలో పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలం చీమలపేటలోని ఎనిమిదో వార్డులో అంతర్గత రహదారి అభివృద్ధి చేసుకోడానికి సిద్ధమై ఆదర్శంగా నిలిచారు.
రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. బురద రోడ్డుపై వాహనాలు నడపలేక అదుపు తప్పుతున్నాయి. దీంతో వార్డు ప్రజలంతా కలిసి స్వచ్ఛందంగా 35 ట్రాక్టర్ ట్రిప్పుల మొరం పోయించుకుని చదును చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మీస అభిలాష్, తొంటి సాగర్, శ్రీనివాస్, రమేష్, ఇరుకుల్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.