Dalit Ratna Award | సుల్తానాబాద్ రూరల్, మే 1 : బాబు జగ్జీవన్ రామ్, బీఆర్ అంబేద్కర్ ల జయంతి ఉత్సవాలు కమిటీ 2026 లో భాగంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన దళిత రత్న అవార్డు కార్యక్రమంలో సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమార్ దళిత రత్న అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ తను చేసిన కార్యక్రమాలతో పాటు స్వచ్ఛంద సేవ, కొన్ని ప్రాంతాలలో అంబేద్కర్ ఆలోచన విధానాలతో ముందుకు సాగుతూ ‘జై భీమ్ యూత్ పేరట’ హైదరాబాద్, నీరుకుల్లతో పాటు పలు ప్రాంతాలలో విద్యార్థులకు, పిల్లలకు బుక్స్ అందించినట్లు తెలిపారు. నిరుపేదలకు ఆర్థిక సాయం, పలు కార్యక్రమాలకు గాను రాష్ట్ర కమిటీ గుర్తించి అవార్డు ఇచ్చి సన్మానం చేసినట్లు చెప్పారు.