Dalit families protest | వీర్నపల్లి , ఆగస్టు 31: తము సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దని పలువురు దళిత కుటుంబాలు అదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో సర్వే నెంబరు 318, 49లో ఎకరం భూమిని దాదాపు 70సంవత్సరాలనుండి అదే భూమిపై ఆధారపడి వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నామన్నారు. సదరూ భూమిపై పట్టాదారు పాస్ బుక్ ఉందని, బ్యాంకు లోన్లు కూడా తీసుకున్నామని తెలిపారు.
ఆ స్థలం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేస్తామని అధికారులు చెప్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ భూములు తీసుకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, మాకు ఆత్మహత్యే శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పునరాలోచన చేయాలని, కలెక్టర్ తమకు న్యాయం చేయలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మునిగే గంగవ్వ,యాస యాకూబ్, మునిగే పోచయ్య, మునిగే లచ్చవ్వ, మునిగే దేవవ్వ, మునిగే శంకర్ తదితరులు పాల్గొన్నారు.