Peddapally | పెద్దపల్లి రూరల్, జనవరి 12 : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరోజ సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి మండలం మూలసాలలో సర్పంచ్ జూపాక శ్వేత ఆద్వర్యంలో సోమవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అందమైన రంగవల్లులు అలంకరించారు. మహిళలు వేసిన ముగ్గులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి సర్పంచ్ శ్వేత, బీసీ నాయకురాలు సరోజ చేతులమీదుగా బహుమతులు అందజేశారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కేశవేని అశోక్ యాదవ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.