Cricket tournament | హుజురాబాద్ రూరల్ మే 28 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో సోషల్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందుపట్ల వెంకటేష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను తెలంగాణ బీసీ సిటిజెన్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు జనార్ధన్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ ఆటలు యువతలో మంచి క్రమశిక్షణను. ఐకమత్యాన్ని పెంపొందించడంతోపాటు శారీరకంగా దృఢత్వాన్ని కలిగి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పరందాములు. మామిడి రమేష్ తో పాటు గ్రామస్తులు యువకులు ఉన్నారు.