Creche center | గోదావరిఖని : సింగరేణి సంస్థ అర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయంలో మహిళా ఉద్యోగుల పిల్లల కోసం క్రెచ్ సెంటర్ (చిన్నారుల సంరక్షణ కేంద్రం) ఏర్పాటు చేస్తున్నట్లు జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ పేర్కొన్నారు. జీఎం కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగుల చిన్నపిల్లలకు ప్రత్యేకంగా సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల మహిళా ఉద్యోగులు తమ పనులు తాము చేసుకునే అవకాశం ఉంటుందని ఈ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇతర పనులను అధికారులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎం కార్యాలయం నందు పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల యొక్క చిన్నారుల గురించి బెంగ అక్కర్లేకుండా ఉద్యోగం చేసే మహిళలు పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని యాజమాన్యం గుర్తించినట్లు పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో క్రెచ్ సెంటర్ (చిన్నారుల సంరక్షణ కేంద్రం) ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని చెప్పారు.
త్వరలో ఇట్టి సంరక్షణ కేంద్రం పనులు పూర్తి చేసుకొని జీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబదించిన పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ-1 ఎస్వోటూ జీఎంఆంజనేయ ప్రసాద్, డీజీఎం ఫారెస్ట్ బానోతు కర్ణ, డీజీఎం సివిల్ వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.