PEDDAPLLY CPM | పెద్దపల్లి : ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన కేంద్ర ప్రభుత్వం వీటికి భిన్నంగా దేశ ప్రజల పైన భారం మోపే విధంగా గ్యాస్ పై రూ.50 పెంచడం పై సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కట్టెల పొయ్యి మీద వంటలు చేసి వంటావార్పు చేశారు.
ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నుండి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించకపోవడం గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం దారుణమన్నారు. దేశంలోని దళిత, బడుగు, బలహీన వర్గాలు గ్యాస్ అదనపు బాదుడు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యంరావు, జ్యోతి, రవీందర్, అశోక్, ప్రశాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.