CPI | కోరుట్ల, సెప్టెంబర్ 11: కార్మికులు, కర్షకుల హక్కుల సాధన కోసం సీపీఐ అలుపెరుగని పోరాటం చేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట భగత్ సింగ్ నగర్ కాలనీలో గురువారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ ఎర్ర జెండాను ఎగుర వేసి అమరులకు ఘన నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ దున్నేవాడికే భూమి. భూమి కోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు నడిపిన మహత్తర పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమన్నారు. నిజాం నిరంకుశ పాలనలో కాసిం రజ్వీ, రజాకారులు, దేశ్ ముఖ్ లు, జమీందారులు, భూస్వాములు జరిపిన అమానుష కాండలో 4500 మంది కమ్యూనిస్టులు నెలకొరిగారన్నారు. సీపీఐ పోరాట పటిమతో రజాకారుల పాలన నుంచి 3000 గ్రామాలకు విముక్తి కలిగిందని, 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మచ్చ గరుడాద్రి, నల్ల భీమయ్య, పిన్నంశెట్టి బ్రహ్మానందం, ఎండి మౌలానా, బండ్ల కళావతి, ఎన్నం రాధ, ముక్రం, మహ్మద్ ఆలీ, చెన్న శ్రీనివాస్, మేదరి గణేష్, తిప్పర్తి రమేష్, పులగం గోపాల్, బాదం మోహన్, గుండేటి పోశెట్టి, సుశీల, పద్మ తదితరులు పాల్గొన్నారు.