Korutla | కోరుట్ల, మే 30 : సీపీఐ జిల్లా నాలుగో మహా సభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ఆహ్వాన సంఘం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో ఆహ్వాన సంఘం ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 13న జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో మహాసభ జరుగుతుందన్నారు.
ఈ సభకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి హజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం జిల్లా అధ్యక్షురాలు కొక్కుల శాంత, ప్రధాన కార్యదర్శి వెన్న సురేష్, కోశాధికారి ముక్రం, నాయకులు ఎర్దండి భూమయ్య, చెన్న విశ్వనాథం, మునుగోరి హనుమంతు, సుతారి రాములు, మౌలానా తదితరులు పాల్గొన్నారు.