CP Ghaus Alam | గన్నేరువరం, అక్టోబర్23: గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను గురువారం సీపీ గౌస్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, ఆవరణలోని వాహనాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఎఫ్ఐఆర్ ఇండెక్స్, పెండింగ్ కేసులపై సమీక్షించి కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి పెట్టడంతో పాటు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలను సెక్టార్ గా విభజించి అధికారులను కేటాయించాలి అన్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ రౌడీషీటర్ల కదలికలపై నిఘా మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.