Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, నవంబర్ 14 : అఖిల భారత సహకార వారోత్సవాలను కాల్వ శ్రీరాంపూర్, కూనారం సహకార సంఘం కార్యాలయాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల్లో విండో చైర్మన్లు చదువు రామచంద్రారెడ్డి, గజవేల్లి పురుషోత్తం జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం సీట్లు పంపిణీ చేశారు.
రైతుల సంక్షేమం కోసం సహకార సంఘాలు పనిచేస్తున్నట్ల వివరించారు. ఈ కార్యక్రమంలో విండో వైస్ చైర్మన్ కామిడి సంధ్య వెంకటరెడ్డి, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, కేడీసీసీబీ మేనేజర్ కరుణశ్రీ, సీఈవోలు కోలేటి శ్రీనివాస్, బోడకుంట విజేందర్, డైరెక్టర్లు, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.