Regularized immediately | రామగిరి ఏప్రిల్ 26: తెలంగాణ విశ్వ విద్యాలయాల్లో పని చేస్తున్న కాంటాక్ట్ అధ్యాపకులను వెంటనే రెగ్యులర్ చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులనుంచి మంథని జే ఎన్ టీ యూ లో ని కాంట్రాక్ట్ అధ్యాపకులు తమను రెగ్యులర్ చేయాలనీ సమ్మె దిగి కళాశాల ఎదుట దీక్ష చేపట్టారు.
వారికి ఆయన శనివారం మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మధూకర్ మాట్లాడుతూ ఎన్నికల మ్యానిపిస్టో హామీ ఇచ్చిన ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగలెజర్ చేస్తామని అధికారం లోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మోసం చేసినట్లు ఆరోపించారు. చదువుకున్న వాళ్లను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ కి పారపాటి గా మారిందన్నారు. తెలంగాణ లోని కాంటాక్ట్ అధ్యాపాకుల న్యాయం మైన డిమాండ్ పరిష్కరించి వారందరిని రెగ్యులర్ చేయాలన్నారు.
ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకులు శంకేసి రవీందర్, పూదరి సత్యనారాయణ గౌడ్, కాపురబోయిన భాస్కర్, తగరం శంకర్ లాల్, డామేరా శ్రీనివాస్, మాచిడి రాజు గౌడ్, కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.