ZP Complex | పెద్దపల్లి రూరల్ , అక్టోబర్ 13 : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం నిర్మాణం చేపడుతున్న జిల్లా పరిషత్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సంబంధిత అధికారులతో కలిసి పెద్దపెల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మాణం అవుతున్న జెడ్పీ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను ఆయన సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ జడ్పీ కాంప్లెక్స్ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలన్నారు. నిర్దేశిత గడువు ఆరు నెలల్లోగా నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. జెడ్పీ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నాణ్యతలో రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జడ్పీ సీఈఓ నరేందర్, పంచాయతీరాజ్ ఈఈ గిరీష్ బాబు, పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.