రాయికల్, జనవరి 22: శ్రీరామ జన్మస్థలం అయోధ్యలో రామమందిరం నిర్మాణం, బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇరువురు విద్యార్థులు తమ దైవభక్తిని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన తాటిపాముల రిషిభాగాధిత్య, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి ఎంజాల హరిహరన్ అట్ట ముకలతో అయోధ్య రామాలయం నమూనాలు తయారు చేశారు. అచ్చం రామాలయాన్ని పోలినట్లు ఆవిష్కరించగా, పలువురు ప్రత్యేకంగా అభినందించారు.