Collector Koya Sri Harsha | పెద్దపల్లి, జూన్2: పైలెట్ గ్రామాల్లో మొదటి విడత మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని రూమ్ నెంబర్ 224లో గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయాన్ని కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్ డేట్ చేయాలన్నారు.
రెండోవ విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులు త్వరగా ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు త్వరగా బిల్లులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీవో బీ గంగయ్య, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.