కోరుట్ల, సెప్టెంబర్ 23 : కాంగ్రెస్ పాలన ఒక దశ, దిశ లేకుండా సాగుతున్నదని, ఎవరికివారే మాయమాటలతో కాలం వెల్లదీస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. ఈ మేరకు మంగళవారం కోరుట్ల పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో 45 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెకులు పంపిణీ చేసి మాట్లాడారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతులకు ఏనాడూ ఇబ్బందులు రాలేదని, ఇప్పుడు యూరియా కోసం రాత్రి, పగలు తేడా లేకుండా పడరాని పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒకటీ నెరవేర్చలేదని పేరొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రగతి కుంటుపడిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
అనంతరం పట్టణంలోని ఏసుకోని గుట్ట దుర్గామాత ఆలయ దసరా నవరాత్రోత్సవాల పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిషరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఫహీం, ఉపాధ్యక్షుడు అస్లాం ఖురేషి, నాయకులు కాశిరెడ్డి మోహన్‌రెడ్డి, పేర్ల సత్యం, సజ్జు, అన్వర్, కేతిరెడ్డి భాసర్‌రెడ్డి, మహమ్మద్ అతిక్, చిత్తరి ఆనంద్, పొట్ట సురేందర్, వంతడుపుల అంజయ్య, గెల్లె గంగాధర్, శ్రీపతి, బింగి సంతోష్, అమెర్, రాజశేఖర్, రహీం పాషా పాల్గొన్నారు.