Chandurthi | చందుర్తి, సెప్టెంబర్ 21 : చందుర్తి సింగిల్ విండో పాలకవర్గ నియామక ఎంపిక ప్రక్రియలో తమ గ్రామానికి ప్రాతినిధ్యం కల్పించలేదని మూడపల్లి గ్రామానికి చెందిన పుల్కం లచ్చయ్య సోమవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రెండు రోజుల క్రితం ప్రకటించిన పాలకవర్గ నియామక ప్రక్రియ నేపథ్యంలో తమ గ్రామానికి ప్రాతినిధ్యం కల్పించలేదని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా వాట్సప్ గ్రూపులో ప్రశ్నించారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన లచ్చయ్య తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ మండల అధ్యక్షుడికి లేఖను రాశారు. దీంతో అధికార పార్టీ నాయకుల్లో అసమ్మతి రాగాలు వ్యక్తమవుతున్నాయని మండల వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఈ విషయమై లచ్చయ్యను వివరణ కోరగా అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.