mallapoor | మల్లాపూర్, ఆగస్టు 20: అబద్దాలకు కేరప్ అడ్రస్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీలిచిందని బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 12.47 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా చేసిందని, ఇందులో కేవలం 10.43 మెట్రిక్ టన్నులను మాత్రమే రైతులకు అందించినట్లు తెలిపారు.
అలాగే రాష్ట్రంలో ఇంకా సుమారు 2.04 లక్షల టన్నుల యూరియా నిల్వలను ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కు నిల్వ చేసినట్లు ఆరోపించారు. దీంతో గ్రామాల్లో తీవ్రంగా యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నరాని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల సంక్షేమ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మి, మండల ఇన్చార్జి పీసు రాజేందర్, మండల ప్రధాన కార్యదర్శి ముద్ధం రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి ఆకుల సతీష్, తదితరులు పాల్గొన్నారు.