వెల్గటూర్, సెప్టెంబర్ 12 : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గుర్రాల రాజేశ్వర్రెడ్డి, నాయకుడు న్యాతరి మురళితో పాటు పలువురు నాయకులు శుక్రవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కరీంనగర్లోని కొప్పుల క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, ఆ పార్టీకి గ్రామాల్లో మనుగడ లేదని విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎండపల్లి మండలాధ్యక్షుడు సింహాచలం జగన్, వ్యవసాయ మారెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏలేటి కృష్ణా రెడ్డి, మాజీ ఎంపీటీసీ గాజుల మల్లేశం, రామడుగు రాజేశ్, కోడి గంగయ్య, రాజేశం, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.