Banda Srinivas | హుజూరాబాద్, సెప్టెంబర్ 1 : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులకు సోయిలేదని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మండిపడ్డారు. హుజురాబాద్ పట్టణంలోని అమరవీరుల స్థూపాన్ని ఎల్ఎండీకీ వచ్చిన కాళేశ్వరం జలాలతో సోమవారం శుద్ధి చేశారు. ఈ సందర్భంగా శ్రీ నివాస్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచం ఒక అద్భుతమని మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ నాయకులకు మాత్రం కళ్లు ఉన్న గుడ్డివాళ్లు లాగా ఉన్నారని ఎద్దెవా చేశారు.
ఆంధ్ర ప్రాజెక్టుల కోసమే గురుశిష్యులు కుట్రలు పన్నుతున్నారని, ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఇక్కడ మున్సిపల్ మాజీ చైర్మన్ గందె రాధిక, నాయకులు తాళ్లపెల్లి శ్రీనివాస్, ఇమ్రాన్, సంగెం అయిలయ్య, క్రషర్ రవీందర్రావు, కట్కూరి మల్లారెడ్డి, కేసీరెడ్డి లావణ్య తదితరులన్నారు.