గన్నేరువరం, మార్చి23: బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పాలనపై విరక్తి చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మండలం లోని జంగపల్లి గ్రామానికి చెందిన మాన కొండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తాడూరి వంశీకృష్ణ రెడ్డి ఆదివారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి వంశీకృష్ణ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి సురేష్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.