Dava Vasantha | జగిత్యాల, ఆగస్టు 20 : నిరుద్యోగుల పాలిట పాపపు ప్రభుత్వంగా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, పార్టీగా కాంగ్రెస్ చరిత్ర పూటల్లో నిలవాబోతుందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వసంత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అబద్దపు హామీలు, అసత్య ప్రచారంతో తెలంగాణ సమాజాన్ని భ్రమాల్లో నెట్టి, అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా వంచిస్తూ నిరుద్యోగులను నిండా ముంచడంతో పాటు, తెలంగాణ సమాజాన్ని నిండా ముంచిందన్నారు.
60 వేల ఉద్యోగాలు ప్రకటించామని చెప్తున్న ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్, పరీక్షల, ఫలితాల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, కేవలం జాబ్ఆర్డర్ కాపీలు పంచి తామే భర్తీ చేశామని ప్రకటించుకోవడం సిగ్గు చేటన్నారు. జాబ్ క్యాలెండర్ ఆచూకీ లేదని, తేదీలు, నెలలు మారుతూ 20 నెలల్లు పూర్తైన నేటికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం విడ్డురమన్నారు. తల్లితండ్రుల గుండెలపై కుంపటి లాగా నిరుద్యోగుల జీవితాలు మారాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి వచ్చాక ఆ కుంపటి దించే ప్రయత్నం ఎందుకు చెయ్యడం లేదో నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చేందుకు నిరుద్యోగులను, విద్యార్థులను రెచ్చగొట్టారని, నేడు ఆ విద్యార్థులు, నిరుద్యోగ యువకులే ప్రభుత్వానికి కంటిలో నలుసులా మారిన విషయం ప్రభుత్వం గుర్తించలన్నారు.
విమర్శలు తేలికే కానీ ఆచరణ కష్టం అని తెలుసుకోవడం లొ కాంగ్రెస్ పార్టీ విఫలమైందని విమర్శించారు. విద్యాశాఖ దుస్థితి అధ్వానంగా మారిందని, కనీసం 20 నెలల కాలంలో విద్యాశాఖపై సమీక్ష చేయకపోవడం విద్యా శాఖపై ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనంగా భావించక తప్పదన్నారు. మన ఊరు మన బడి పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు అందక రెండు సార్లు డిప్యుటీ సీఎం చాంబార్ ఎదుట ధర్నా, నిరసన తెలపడం ప్రభుత్వం అసమర్ధత కూ నిదర్శనమన్నారు. గురుకుల పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజాన్, పాము కాటుల వాళ్ళ మృతి చెందారని, హాస్టల్లు డెత్ స్పాట్లను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం చెప్పుకునే 60 వేల ఉద్యోగాల్లో కానిస్టేబుల్ కొలువు ఒక్కటి కూడా లేదని, 20 నెలలల కాలంలో గ్రూప్ 3, గ్రూప్-4 లాంటి పోస్ట్‌లకు మోక్షం లభించడం లేదన్నారు. 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, 420 హామీల సంగతి ఏంటని ప్రశ్నించారు. నిరుద్యోగుల కృషి తో గద్దెనెక్కిన ప్రభుత్వం నేడు అదే నిరుద్యోగులను విస్మరించడంను బీఆర్ఎస్ పక్షాన ఖండిస్తున్నామన్నారు. తక్షమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, నిరుద్యోగులకు ప్రభుత్వం అండగా నిలవాలని వసంత డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు ఆనంద్ రావు ప్యాక్స్ ఛైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు బుర్ర ప్రవీణ్ గౌడ్ జక్కుల తిరుపతి, నాయకులు హరీష్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.