BRS | సారంగాపూర్, జూలై 30: కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని, కేసీఆర్ పేరు చెబితేనే ఓటు వేసే పరిస్థితి ఉందని జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత-సురేష్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి బుధవారం సాయంత్రం మండలంలోని రేచపల్లి ఎంపీటీసీ పరిధిలో నాయకులు, కార్యకర్తలతో దావ వసంత-సురేష్ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలపై దశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరిని మోసం చేసిందని, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పుతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలు, ఆరు గ్యారంటీలు ఇచ్చిందని, వాటి అమలులో విఫలమైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తు గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రేచపల్లిలో గులాభి జెండా ఎగరాలని అందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని అన్నారు. రేచపల్లి ఎంపీటీసీ బీఆర్ఎస్ కైవసం చేసుకునేలా సన్నద్ధం కావాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మోజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తెలు రాజు, మాజీ సింగిల్ విండో చైర్మన్, సీనియర్ నాయకులు సాగి సత్యం రావు, మాజీ ప్రజాప్రతినిధులు ఓడ్నాల లావణ్య జగన్, బుచ్చిమల్లయ్య, అజ్మీరా శ్రీ లత శ్రీనివాస్, బైరి మల్లేష్ యాదవ్, నాయకులు సాంబరి గంగాధర్, ఎండబెట్ల ప్రసాద్, సాతాల్ల రమేష్, రాయమల్లు, రమేష్, ప్రభాకర్ రెడ్డి, ఎరుకొండ రాజు, సుంకం రమేష్, సుమంత్, మనోజ్, హరీష్, మల్లేష్, గంగన్న, యాకూబ్, సుదర్శి, మల్లయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.