KTR Sena | సిరిసిల్ల రూరల్, మే 13: కాంగ్రెస్ సర్కార్ రైతులను ఉసురు పోసుకుంటున్నదని, రైతులు గోస పడుతుంటే మరో వైపు రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో మునిగి తేలుతున్నాడని కేటీఆర్ సేనా తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తంగళ్ళప ల్లి మండలం బద్దెన పల్లి లో కేటీఆర్ సేనా గ్రామ కమిటీని నియమించారు. ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ సమయానికి ధాన్యాన్ని కొనకుండా రైతుల ఊసురు తీస్తున్న రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వంమని ఆరోపించారు.
ఒకవైపు వడదెబ్బకు తాళలేక వడ్ల కుప్పలపైనే బలి అవుతున్న రైతన్నలు ఇంకోవైపు అందాల పోటీల్లో మునిగితేలుతున్న రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. రైతుల పై తీరు మార్చుకోకపోతే రైతుల పక్షాన ఉద్యమిస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన KTR సేన గ్రామ శాఖ అధ్యక్షుడు సిలివెరీ స్టెప్పి మాట్లాడుతూ అధికార పార్టీ చేస్తున్న మోసలను ప్రజాల కు వివరస్తూ ప్రభుత్వ వైకరిని ఎండగట్టి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు BRS పార్టీ చేసిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మల్లోసారి పార్టీ ని అధికారం తెచ్చేవరకు నిరంతరం పని చేస్తామన్నారు.
ఈ కార్యక్రమం లో KTR సేన బద్దెనపల్లి గ్రామ ప్రధాన కార్యదర్శి కొలపురి రాజు, సోషల్ మీడియా ఇంచార్జ్ శివరాత్రి ఐలయ్య మండల ఉపాద్యాక్షులు ,రేగుల రాజు,ప్రధాన కార్యదర్శి తౌటి శివ కృష్ణ, ఇంచార్జీ మామిడాల ఉమాశంకర్ సోషల్ మీడియా మండల అధ్యక్షులు విన్నుబాబు, BRS పార్టీ గ్రామశాఖ, సీనియర్ నాయకులు , ఆవునూరి వెంకట్, రాములు, సిలువెరీ చిరంజీవి, ఆగం రావు, యూత్ నాయకులు వినయ్, వికాస్ సన్నీ, విక్రమ్,అరవింద్, అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.