MLA Dr. Sanjay Kumar | సారంగాపూర్, జులై 23: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలంలోని అర్పపల్లి గ్రామంలో ఎస్సీ, సబ్ ప్లాన్ నిధులు రూ.54 లక్షలు, రేచపల్లి గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.54లక్షలతో అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు కొత్త రేషన్ కార్డులు మంజూరుతో సన్న బియ్యం లబ్ధి పొందుతున్నారని అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు.
రేవంత్ రెడ్డి రైతు బిడ్డ అని రుణ మాఫీ, రైతు భరోసా తో రైతుల కళ్లలో ఆనందం నింపారాని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు మహిళ సంఘాల ద్వారా రూ.1 లక్ష వరకు రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కు ఉచిత ఇసుక పాలసీ అమలు అయ్యే విధంగా అధికారులు చొరవ చూపాలని అన్నారు. అత్యధిక నిధులు ఈజిఎస్ లో జగిత్యాలకు వచ్చాయని పేర్కొన్నారు. సిమెంట్ స్టీల్ విషయం లో ధరలు స్థిరంగా ఉండే విధంగా కలెక్టర్లకు ప్రభుత్వం సూచనలు చేశారని అన్నారు. అలాగే రేచపల్లి గ్రామంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు.
ఈ కార్యక్రమాల్లో డీఈ మిలింద్, తహసీల్దార్ వహిదుద్దీన్, ఎంపీడీవో చౌడారపు గంగాధర్, ఏఈ రాజమల్లయ్య, ఎంపీవో సలీం, నాయకులు సీనియర్ నాయకులు గుర్రాల రాజేందర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్, పాక్స్ మాజీ చైర్మన్లు మల్లారెడ్డి, నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ లు భూక్యా లావణ్య గంగాధర్, ఎడమల జయ లక్ష్మా రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రాజేశం, లక్కడి రెడ్డి, గూడ లింగారెడ్డి, బదినపల్లి సురేష్, మల్లేశం, మహేష్, మదన్, రమేష్, లచ్చన్న, మద్దెల ఆనంద్, వంశీ, శేఖర్, మల్లేష్, అధికారులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.