Saidapur | సైదాపూర్ : కాళేశ్వరం పై ఎవరెన్ని కుట్రలు చేసినా ఫలించవని బీఆర్ఎస్ సైదాపూర్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య అన్నారు. సైదాపూర్ మండలకేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జస్టిస్ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు దానిని బాగు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
రైతు భరోసా విడుదలలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. ఒకే విడుతలో రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఆర్టీసీ కార్మికుడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బిల్లా వెంకట్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చెల్మల రాజేశ్వర్ రెడ్డి, సర్పంచ్ లు తొంట రజినీకాంత్, మాచమళ్ల శ్రీకాంత్, చాడ అఖిల ప్రకాష్ రెడ్డి, ఉప సర్పంచ్ కౌడాగాని వీరేశం, నాయకులు బత్తుల లక్ష్మీనారాయణ, పైడిపల్లి రవీందర్, రేగుల అశోక్, పరుకాల నారాయణ, వెన్నమళ్ల రమేష్, మునిపాల శ్రీనివాస్, ఏషిక ఐలయ్య, మహిపాల్ సింగ్, నాగండ్ల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.