Best Teacher Award | చిగురుమామిడి, సెప్టెంబర్ 3: చిగురుమామిడి మండలంలోని రామంచ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న చీల పద్మ, ముది మాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వినయధర రాజు, ఇందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సవిత, తెలంగాణ మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న ముక్తి ప్రసాద్ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.
కరీంనగర్ లోని కలెక్టర్ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ ఉత్తమ ఉపాధ్యాయులను మెమొంటో, ప్రశంసా పత్రంతో పాటు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులందరినీ మండల విద్యాధికారి పావని, జిల్లా సెక్టరల్ అధికారి అశోక్ రెడ్డి బుధవారం అభినందించారు.
ప్రధానోపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ అభినందన
చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి, ముల్కనూర్, రామంచ, ముది మాణిక్యం, ఇందుర్తి, నవాబుపేట, సుందరగిరి, బొమ్మనపల్లి, రేకొండ గ్రామాలలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు కేజీబీవీ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత పొందడంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో బహుమతులు అందజేసి, అభినందించారు. కాగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం పట్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ హర్షిత్ కౌర్ ఉపాధ్యాయులను అభినందించారు. అలాగే రేకొండ గ్రామానికి చెందిన అరిగెల శ్రీనివాస్ హుజురాబాద్ మండలం ధర్మరాజు పల్లిలో ఎస్టీజీ ఉపాధ్యాయుడునీ ఉత్తమ ఉపాధ్యాయుడిగా సన్మానించడం పట్ల పెద్దమ్మపల్లె విద్యావంతుల వేదిక కమిటీతోపాటు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.