సిరిసిల్ల టౌన్, ఆగస్టు 24 : సాం చాలకు విద్యుత్ సబ్సిడీని అమలు చేయాలని ఆసాముల సం ఘం నా యకులు డిమాండ్ చేశారు. ఈ మేర కు శుక్రవారం సిరిసిల్ల సెస్ కార్యాల యం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సిరిసిల్ల రవీందర్ మాట్లాడుతూ, విద్యుత్ బిల్లులకు సబ్సిడీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
బకాయి బిల్లులు సబ్సిడీతో చెల్లిస్తామని కోరగా సెస్ అధికారులు స్పందించడం లేదన్నా రు. గతంలో తాము రిలే నిరాహార దీక్షలు చేసిన సందర్భంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తమ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
కానీ, సెస్ అధికారులు మాత్రం తమకు ఎటువంటి ఆదేశాలు అందలేదని చెబుతున్నారన్నారు. సెస్ ఎండీని కలిసి సమస్య తెలపగా ఎటువంటి ఆదేశాలు లేనందున పాత పద్ధతిలోనే బిల్లులు కొడుతున్నట్టు చెప్పారని పేర్కొన్నారు. తమ సమస్యను పరిష్కరించకుంటే నిరసన బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆసాముల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.