Health camps | పెద్దపల్లి, జూన్2: జిల్లా ప్రజల ఆరోగ్య స్థితిని తెలుసుకోనేందుకు జూన్ మూడు నుండి సమగ్ర ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి తెలిపారు. కలెక్టరేట్లోని మీని మీటింగ్ హాల్లో సమగ్ర ఆరోగ్య శిబిరాల నిర్వాహణపై హెల్త్ అసిస్టెంట్లు, ఐసీటీసీ కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందితో సోమవారం సమావేశమై ఆమె మాట్లాడారు. సమగ్ర ఆరోగ్య శిబిరంలో వైద్యాధికారి, ల్యాబ్ టెక్నిషియన్, కౌన్సిలర్ పాల్గొంటారని తెలిపారు. డయాబెటిస్, బీపీ, హిమోగ్లోబిన్, ర్యాండమ్ బ్లడ్ శాంపిల్ పరీక్షలు, క్షయ వ్యాధి నిర్దారణకు స్పూటమ్ పరీక్షలు చేస్తారని చెప్పారు.
సమగ్ర ఆరోగ్య శిబిరాల వివరాలు
3 న చందపల్లి బస్తీదవాఖాన, 4న పెద్దపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 5న రంగంపల్లి బస్తీదవాఖాన, 6న రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, , 9న రంగాపూర్ గ్రామపంచాయతీ, 10న రాఘవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 11, 12న రామగుండం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 13న 5 ఇంక్లైన్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 16న అడ్డగుంటపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 17న లక్ష్మీపూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 18న అల్లూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 19న గరెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 20న పుసాల హెల్త్ వెల్ నెస్ సెంటర్, 21న దొంగతుర్తి హెల్త్ వెల్ నెస్ సెంటర్, 23న మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 24న అప్పన్నపేట హెల్త్ వెల్ నెస్ సెంటర్, 25న వెన్నంపల్లి హెల్త్ వెల్ నెస్ సెంటర్, 26న కునారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 27న కొలనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 28న కనగర్తి హెల్త్ వెల్ నెస్ సెంటర్, 30న ఖిలావనపర్తి హెల్త్ వెల్ నెస్ సెంటర్లలో నిర్వహించే ఆరోగ్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో వైద్యులు కేవీ సుధాకర్ రెడ్డి, ఆర్ రాజమౌళి, బీ శ్రీరాములు, వీ వాణిశ్రీ, బీ కిరణ్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.