Sarangapoor | సారంగాపూర్, అక్టోబర్ 13: పోషకాహారం తీసుకోవడం ద్వారనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ధర్మపురి ప్రాజెక్ట్ సీడీపీఓ వాణిశ్రీ అన్నారు. పోషణమాసం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని కస్తూరిభా విద్యాలయంలో ‘మీరు తినే ఆహారం మీ పెరుగుదల’ అనే అంశంపై విద్యార్థినులకు సోమవారం వ్యాచ రచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుకూరలు, పండ్లు వాటి ఉపయోగాలు చిరుధాన్యాల వాడకం, పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు, విటమిన్లు, రక్తహీనత, పరిశుభ్రత, తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
రక్తహీణతని నివారించి ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు మండల వైద్యాధికారి రాధా రెడ్డి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మండల విద్యాధికారి కిశోర్, ప్రత్యేక అధికారి వీణ, ఏనీ డీపీవో మౌనిక, ఐసీడీఎస్ సూపర్వైజర్ లత, అంగన్వాడి టీచర్లు, సంద్య, లక్ష్మి, విజయలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.