Rajanna temple | రాజన్న ఆలయ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులపై కొండ్లెపు ముత్యం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బిగితే కు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
Rajanna temple | వేములవాడ, జూన్ 19 : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులపై కొండ్లెపు ముత్యం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బిగితే కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. మోచి కులం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న తను వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయం ఎదురుగా కొబ్బరికాయలు, స్వామి వారి ఫొటోలతో కూడిన దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నానని తెలిపారు. పురపాలక సంఘం రహదారిపై దుకాణం పెట్టావని, దీనిని వెంటనే తీసివేయాలని మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
20 రోజులుగా తనను వేధిస్తుండగా తన దుకాణంలోకి ఏఈఓలు శ్రవణ్ కుమార్, జయ కుమారి, పర్యవేక్షకులు నూగూరి నరేందర్, గడ్డం రాజేందర్, ఏఈ రామ్ కిషన్ రావు, భగవంత రావు, భరత్, గంగిశెట్టి సాయి, ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది దుకాణంలోకి చొరబడి కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులు పేర్కొన్నారు. కులం పేరుతో దూషించి తనను బెదిరించిన వారిపై ఈవో రమాదేవితో పాటు ఆలయ ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు పేర్కొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

