సుల్తానాబాద్ రూరల్, జనవరి 19: పేదల మొఖాల్లో ఆనందం నింపడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్‌రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని గురువారం సందర్శించారు. పరీక్షలు చేస్తున్న తీరు ను పరిశీలించారు. అవసరం ఉన్న వారి కి అద్దాలను అందజేశారు. ఈసందర్భం గా వారిద్దరు మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ముందు ఆలోచనతో రాష్ట్రంలో కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలను చేపటలేదన్నారు. 18ఎళ్ల నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలను చేయించుకోవాలన్నా రు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, ఎంపీడీవో శశికళ, మండల స్పెషల్ ఆఫీసర్ రవీందర్, సర్పంచ్ వీరగోని సుజాత-రమేశ్ గౌడ్, విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, ఎంపీటీసీలు అనూష, ఫకీర్యాదవ్, పీహెచ్సీ వైద్యులు ముధూకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఉపసర్పంచ్ మధు, కారోబార్ వెంకన్న, నాయకులు జూపల్లి రాజేశ్వర్‌రావు,బొల్లం లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.