శ్రీ ఆంజనేయం.. కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు ప్రారంభం
‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. రామభక్త హనుమాన్‌కీ.. జై బోలో హనుమాన్‌కీ’ నామ స్మరణతో అంజన్న క్షేత్రం మార్మోగుతున్నది. ఆలయానికి తరలివస్తున్న దీక్షాపరులతో కొండంతా కాషాయమయమవుతున్నది.
- ఆంజనేయుడికి భద్రాద్రి రామయ్య పట్టు వస్ర్తాలు
- రుత్వికుల వేద మంత్రోచ్ఛారణల మధ్య త్రికుండాత్మక యజ్ఞం
- తరలివస్తున్న దీక్షాపరులు
‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. రామభక్త హనుమాన్‌కీ.. జై బోలో హనుమాన్‌కీ’ నామ స్మరణతో అంజన్న క్షేత్రం మార్మోగుతున్నది. ఆలయానికి తరలివస్తున్న దీక్షాపరులతో కొండంతా కాషాయమయమవుతున్నది. కొండగట్టులో మూడు రోజుల పాటు జరిగే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభం కాగా, యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. కాగా, స్వామివారికి భద్రాద్రి ఆలయం నుంచి తెచ్చిన పట్టు వస్ర్తాలతోపాటు పోచంపల్లి పట్టువస్ర్తాలను ఎమ్మెల్యే సుంకె సమర్పించగా, తొలిరోజు రుత్వికుల వేద మంత్రోచ్ఛారణల మధ్య త్రికుండాత్మక యజ్ఞం వైభవం జరిగింది. అటు రాష్ట్ర నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తుండగా, మాల విరమణ మొదలైంది.
మల్యాల, మే 12: కొండగట్టు అంజన్న సన్నిధిలో హ నుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలను ఆలయ అర్చకులు, వేద పండితులు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. మూడురోజులపాటు నిర్వహించే వేడుకల్లో భాగంగా, గురువారమే అర్చకులు శాస్ర్తోక్తంగా ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. జయంతి వేడుకల సందర్భంగా అంజన్నకు భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయం తరపున పట్టువస్ర్తాలు సమర్పించారు.
భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి, ప్రధాన అర్చకులు విజయ రాఘవన్, అర్చకులు అమరవాది వెంకట రాఘవన్‌తో పాటూ ఆలయ సిబ్బంది పట్టువస్ర్తాలను కొండగట్టుకు తీసుకురాగా, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఆలయ అనువంశిక అర్చకులు, పాలకమండలి సభ్యులతో కలిసి స్వామివారి చెంతకు తీసుకువచ్చారు. ఎమ్మెల్యేతోపాటు భద్రాచలం ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు విజయ్ వాఘవన్కు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ సాంస్కృతిక ఇన్చార్జి కలకోట శ్రీనివాసచారి ఆధ్వర్యంలో కళాకారుల బృందం చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కొండగట్టు వై జంక్షన్ నుంచి ఆలయం దాకా డప్పు చప్పు ళ్లు, కోళాటాలు, ఒగ్గు డోలు విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య ఆటపాటలతో పట్టువస్ర్తాలను ఎదుర్కొన్నారు.

తరలివస్తున్న దీక్షాపరులు
పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. తొలి రోజు దీక్షాపరుల రాక సన్నగిల్లినప్పటికీ సూర్యాస్తమయం తర్వాత పెరిగింది. కాలినడకన వచ్చేవారు కొండగట్టు గుట్ట కింది నుంచి ఘాట్ రోడ్డు, పురాతన మెట్ల దారి ద్వారా ఆలయానికి చేరుకుంటున్నారు. ఉత్సవాల తొలి రోజునే మాల విరమణ మండపాన్ని తెరిచారు. విరమణ మండపంలో అంజనేయ స్వామి చిత్రపటాన్ని ప్రతిష్టించి శుక్రవారం ఉదయం నుంచే మాల విరమణ చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

