హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి సంతాప సభను ఈ నెల 10న వరంగల్ జిల్లా నల్లబెల్లిలో నిర్వహించాలని బీఆర్ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో మంగళవారం సమావేశమైన ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి సంతాప సభ ఏర్పాట్లపై చర్చించారు. సమావేశానికి ముందు పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, బండ ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తకళ్లపల్లి రవీందర్రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య తదితరులు నివాళులర్పించారు.