అద్దంకి, మహేశ్‌గౌడ్‌పై ఎన్‌హెచ్చార్సీలో ఫిర్యాదు
బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావుపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన ‘క్షుద్ర పూజలు-తాంత్రిక పూజలు’ ఆరోపణలపై జాతీయ మానవ హకుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)ను న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్ ఆశ్రయించారు.
- హరీశ్‌పై క్షుద్రపూజల ఆరోపణలు మానవ హకుల ఉల్లంఘనే
- ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం
- న్యాయవాది కారుపోతుల రేవంత్
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావుపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన ‘క్షుద్ర పూజలు-తాంత్రిక పూజలు’ ఆరోపణలపై జాతీయ మానవ హకుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)ను న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్ ఆశ్రయించారు. ఎన్‌హెచ్చార్సీ సభ్యురాలు విజయ భారతి సాయనీకి మంగళవారం ఫిర్యాదు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హరీశ్‌రావుపై ఎలాంటి ఆధారాలు లేకుండా శివమొగ్గ, తిరుచిరాపల్లిలో క్షుద్ర పూజలు నిర్వహించారని మీడియా ఎదుట మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారని ఆక్షేపించారు.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియో ద్వారా ఇదే తరహా ఆరోపణలు చేశారని, రాజ్యాంగబద్ధమైన, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం ఒక ప్రజాప్రతినిధి గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, వారి మానవ హకులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. మూఢనమ్మకాలపై ప్రభుత్వం, పోలీసుశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటి ప్రకటనలు చేయడం మూఢనమ్మకాల ఆధారిత నేరాలను ప్రోత్సహించే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. నిరాధార ఆరోపణలు చేసిన ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలకు పరిశీలించాలని, మూఢనమ్మకాల ఆధారితహింసను నివారించే దిశగా ప్రజాప్రతినిధులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఎన్హెచ్ఆర్సీని కోరినట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

