బెంగళూరు: ఒక ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ట్రాలీలోని ఐరన్ రాడ్లు బస్సు ముందు అద్దం నుంచి లోపలకు చొచ్చుకెళ్లాయి. డ్రైవర్ శరీరంలోని అవి దిగడంతో అక్కడికక్కడే అతడు మరణించాడు. పది మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. (Iron Rods Pierce RTC Bus) కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వరాహసంద్ర గేట్ సమీపంలో కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కు చెందిన బస్సు వెనుక నుంచి ఒక ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి ట్రాక్టర్ ట్రాలీలో రవాణా చేస్తున్న ఇనుప కడ్డీలు బస్సు ముందు నుంచి లోపలకు చొచ్చుకెళ్లాయి. బస్సు డ్రైవర్ పొట్ట, శరీరంలోకి అవి దిగడంతో అక్కడికక్కడే మరణించాడు. చనిపోయిన ఆ డ్రైవర్‌ను హాసన్‌కు చెందిన శేఖర్‌గా గుర్తించారు.
కాగా, ఆ బస్సులోని ప్రయాణికుల్లో పది మందికిపైగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బెల్లూరులోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బస్సు ముందు అద్దం నుంచి లోపలకు చొచ్చుకెళ్లిన ఐరన్ బార్లు, బోల్తాపడిన ట్రాక్టర్ దృశ్యాలు, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
KSRTC ಬಸ್ಗೆ ನುಗ್ಗಿದ ಕಬ್ಬಿಣದ ಬಾರ್ಗಳು ಬಸ್ ಚಾಲಕ ಮೃ*ತ್ಯು! | Guarantee News #Mandya #MandyaBusAccident #KSRTCBusAccident #KSRTCBus #IronRodsAccident #IronBarsEnterBus #IronRodsHitBusDriver #BusDriverDeath #radhahiregoudar #guaranteenews #guaranteenewskannada pic.twitter.com/qXkhWqi0FZ
— Guarantee News (@Guarantee_News) September 9, 2026