న్యూఢిల్లీ : భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) డాబర్ సంస్థకు చెందిన తేనె, నెయ్యి సహా పలు ఆహార ఉత్పత్తుల విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
ఆయా ఉత్పత్తులపై 100% నేచురల్ అంటూ తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నందునే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్లో ఉత్పత్తులను విక్రయిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ డాబర్ ఉత్పత్తుల లేబులింగ్, మార్కెటింగ్ విధానంపై కొద్దికాలంగా దృష్టిసారించింది.