ఫ్లోరిడా : అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నాథన్ థామస్ 18 ఏండ్ల 346 రోజుల్లోనే అతి పిన్న ప్రొఫెసర్గా గిన్నిస్ ప్రపంచ రికార్డుకు ఎక్కి 306 ఏండ్లుగా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అతను ప్రస్తుతం మయామీ డేడ్ కాలేజీలో ఇంజినీరింగ్ ఇన్స్ట్రక్టర్గా చేరి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు.
అంతకుముందు ఈ రికార్డు స్కాటిష్ గణిత శాస్త్రవేత్త కోలిన్ మాక్లరిన్ పేరుపై ఉంది. అతను 19 ఏండ్ల వయసులో 1717లో ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టారు.