కొడిమ్యాల, ఫిబ్రవరి 9: జిల్లాలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు. మండలంలోని పూడూర్ హైస్కూల్, కొండగట్టులో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలకు కలెక్టర్ హాజరై మాట్లాడారు . ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు ప్రతి రోజూ గ్రామాల్లో పర్యటించి పారిశుధ్యం, తాగు నీరు తదితర వాటిని పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో పూడూర్ , కొండగట్టు ప్రత్యేకాధికారులు మణిదీప్, వెంకటేశం, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజం, ఎంపీడీవో పద్మజారాణి, ఎంపీవో ప్రవీణ్, పీహెచ్సీ వైద్యురాలు పరమేశ్వరి, సీహెచ్‌వో రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి మనోహర్ ఉన్నారు.
జగిత్యాల టౌన్, ఫిబ్రవరి 9 : సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ యాస్మిన్ బాషా పేర్కొన్నారు. పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్‌లో పీఆర్టీయూ జిల్లా శాఖ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సంయుక్తంగా శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అమర్నాథ్రెడ్డి, ఆనందరావుతో పాటు 33 మంది ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించి సర్టిఫికెట్లు అందించారు.
కార్యక్రమంలో పీఆర్టీయూ అధికార పత్రిక పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంపాదకవర్గ సభ్యుడు మహేందర్‌రెడ్డి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, టీఎన్జీవో అధ్యక్షుడు బోగ శశిధర్, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు జమీల్, రాజు, మహేశ్, చంద్రప్రకాశ్, శ్రీనివాస్‌రెడ్డి, సురేఖ, జమున, జయప్రద, వసంత, చందన, రాధాలక్ష్మి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రాజశేఖర్, మల్లారెడ్డి, 18 మండలాల బాధ్యులు పాల్గొన్నారు.