జగిత్యాల కలెక్టరేట్, సెప్టెంబర్ 11: ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటుతున్నారని కలెక్టర్ షేక్ యాస్మిన్ బా షా అన్నారు. జిల్లాకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు తెలంగాణ క్రీడా పాఠశాలలకు ఎంపికైన సందర్భంగా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సో మవారం కలెక్టరేట్లో సత్కరించి, అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రా ష్ట్ర వ్యాప్తంగా క్రీడా పాఠశాలల్లో వంద సీట్లుంటే జిల్లా నుంచి ఎనిమిది మంది విద్యార్థులు సీటు పొందడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యవంతులుగా తీర్చిదిద్ది జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించే విధంగా శిక్షణ అందుతు న్నదన్నారు. నాల్గో తరగతి విభాగంలో నాగిశెట్టి చైతన్య, గోరుమంతుల శ్రీకేశ్, పాదం సాహిత్పటేల్, పొలాస అలకనంద, 5వ తరగతి విభాగం లో పుల్లపు సౌమిత్రి, కావ్య శ్రీ, అల్లూరి సంస్కృతి విజ్ఞాని రెడ్డి, మామిడిపెల్లి సాహితిని కలెక్టర్ శాలువాతో సన్మానించి అభినందించారు. కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్లు టీఎస్ దివాకర, బీఎస్ ల త, జిల్లా యువజన క్రీడల శాఖాధికారి డాక్టర్ కే రవికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 25 అర్జీలు
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో షేక్ యాస్మిన్ బాషా సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలు పరిష్కరించాలంటూ 25 మంది కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్లు టీఎస్ దివాకర, బీఎస్ లత, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్లోని వివిధ విభాగాల సూపరింటెండెంట్లు ప్లాల్గొన్నారు.