Huzurabad | హుజూరాబాద్, ఏప్రిల్ 19: ‘కలెక్టర్ గారు భూభారతి పై మాకు చాలా సందేహాలు ఉన్నాయి తీర్చండి…’ అంటూపలువురు రైతుల నోటిలో నుంచి మాటలు రాగానే మాకు వీడియో కాన్ఫరెన్స్ ఉందంటూ… కలెక్టర్ పమేల సత్పతి వెళ్లిపోయారు. ఈ సంఘటన పట్టణములోని సిటీ సెంటర్ హాలులో శనివారం చోటుచేసుకుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ అవగాహన సదస్సుకు హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ భూభారతిలో రైతులకు చాలా ఉపయోగపడుతుందని, వాటిని వివరించి సదస్సు ముగించి కలెక్టర్ వెళ్లిపోతుండగా రైతులు మేడం మీరు మాట్లాడిన దాన్నిబట్టి చూస్తే మాకు భూభారతిలో ఇంకా చాలా సందేహాలు ఉన్నాయని వాటిని మీకు విన్నవించుకుంటామని, వాటిని నివృత్తి చేయాలని కలెక్టర్‌ను కోరారు. అయితే ఆమె సాధ్యమైనంత వరకు మీ సమస్యలను తీరుస్తామని, మాకు వీడియో కాన్ఫరెన్స్ ఉందంటూ కలెక్టర్ వెళ్లిపోయారు. చేసేది ఏమి లేక సమావేశం నుండి రైతులు కూడా ఇంటిబాట పట్టారు.