కలెక్టరేట్, మే 11: ఈ నెల 13న నిర్వహించే లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేరొన్నారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో పార్లమెంట్ పరిధిలోని హుస్నాబాద్ మినహా మిగతా ఆరు నియోజకవర్గాల వారీగా పోలింగ్ అధికారుల థర్డ్ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించగా, నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్, ఐఏఎస్ అధికారి అమిత్కటారియా పర్యవేక్షించారు.
ర్యాండమైజేషన్ ప్రక్రి య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ, నియోజకవర్గాల వారీగా పీవోలు, ఏపీవోలు, ఓపీవోలను పోలింగ్స్టేషన్లకు కేటాయించామన్నా రు. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి 395 పోలింగ్ స్టేషన్లకు 1,804 మంది, చొప్పదండిలో 327పోలింగ్స్టేషన్లకు 1,528మంది, మానకొండూర్‌లో 316 పోలింగ్ స్టేషన్లకు 1,472మంది, హుజురాబాద్‌లో 305 పోలింగ్ స్టేషన్లకు 1,404మంది, సిరిసిల్లలో 287పోలింగ్ స్టేషన్లకు 1,376 మంది, వేములవాడలో 260పోలింగ్ స్టేషన్లకు 1,232మంది పీవోలు, ఏపీవోలు, ఓపీవోలను కేటాయించామని తెలిపారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, పూజారి గౌతమి, సీపీవో కొమురయ్య, కలెక్టరేట్ ఏవో సుధాకర్ పాల్గొన్నారు.
కలెక్టరేట్, మే 11: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సిరిసిల్ల, వేములవాడ ఏఆర్వోలు, ఎన్నికల నోడల్ ఆఫీసర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఓటింగ్ శాతం నమోదుపై వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, టెక్నాలజీని వాడుకొని పోలింగ్ శాతాన్ని నిర్దేశించిన సమయం ప్రకారం నమోదు చేయాలన్నారు. ఇకడ అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యానాయక్, ఆర్డీవోలు రమేశ్, రాజేశ్వర్, జడ్పీసీఈవో ఉమారాణి, డీఆర్డీవో శేషాద్రి, నోడల్ ఆఫీసర్ రఫీ, సీపీవో శ్రీనివాసాచారి, ఏవో రాంరెడ్డి, తదితరులు ఉన్నారు.
ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని స్వీప్ నోడల్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఓటు హకును వినియోగంపై స్వీప్ ఆధ్వర్యంలో తెలంగాణ సాంసృతిక సారథి కళాకారులు శనివారం సిరిసిల్లలోని ఆర్టీసీ బస్ స్టాండ్ లో (ఐ ఓటు ఫర్ ష్యూర్) ఓటు హకు నా బాధ్యతపై అవగాహన కల్పించారు. ఓటు ప్రాముఖ్యతను స్వీప్ నోడల్ అధికారి, అడిషనల్ డీఆర్డీవో గొట్టె శ్రీనివాస్, తెలంగాణ సాంసృతిక సారథి కళాకారులు వివరించారు.