కార్పొరేషన్, మార్చి 27: కరీంనగర్ నగరపాలక సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.443 కోట్లతో అంచనా బడ్జెట్‌ను ఆమోదించారు. గురువారం సాయంత్రం క రీంనగర్ నగరపాలక సంస్థలో స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన, బడ్జె ట్ సమావేశం నిర్వహించారు. 2025-202 6 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన రూ.443.98 కోట్లు అంచనా బడ్జెట్‌ను ఆమోదించారు. సొంత ఆదాయ వనరులు, ప్రభు త్వ గ్రాంట్లకు సంబంధించిన పన్నులు, పన్నేతర ఆదాయ వనరులు, ప్రణాళిక నిధులు, ప్రణాళికేతర నిధులు, ఇతర నిధులకు సంబంధించిన పద్దులపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు.
నగరపాలక సంస్థ జనరల్ ఫండ్ నుం చి 1/3 నిధులను విలీన గ్రామాల ప్రాంతా లు, అభివృద్ధి చెందని ప్రాంతాలు, బలహీన వర్గాల మైనారీటీలు నివసించే ప్రాంతాలు, మురికివాడల మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. మిగిలిన నిధులను వివిధ డివిజన్లలో అభివృద్ధి పనులకు కేటాయించారు. ప్రభుత్వం ద్వారా వచ్చే ని ధుల నుంచి పారులు, వైకుంఠ ధామాలు అభివృద్ధి, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, శాస్త్రీయ పద్ధతిలో డంపు యార్డుల నిర్మాణం, కరెంట్ బిల్లుల చెల్లింపులు మొదలగు వాటికి అయ్యే ఖర్చులను నగరపాలక సంస్థ ఆదా యం నుంచి వినియోగించాలని బడ్జెట్లో సూచించారు.
బడ్జెట్లో అంచనాలు సవరించిన అంచనాల పద్దుల ప్రకారం సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ పమేలా సత్ప తి మాట్లాడుతూ, నగరపాలక సంస్థకు సొంత ఆదాయ వనరులు ఇంకా మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ టార్గెట్ ప్రకారం ఆస్తి పన్నులు పూర్తిస్థాయిలో వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాపార సంస్థల ట్రేడ్ లైసెన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
ఎల్ఆర్ఎస్పై పూర్తిస్థాయిలో ఫోకస్ చేయడంతోపాటు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొని రావాలన్నారు. నగరంలో పెండింగ్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నగర తాగునీటి సరఫరా ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనర్ చాహత్ భాజ్‌పాయ్, అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు స్వరూపారాణి, ఖాదర్ మొహియుద్దీన్, ఎస్ఈ రాజ్‌కుమార్, ఈఈ యాదగిరి, సంజీవ్, ఏసీపీలు బషీరొద్దీన్, వేణు, అకౌంట్స్ అధికారి శిరీష, ఆర్వో భూమానందం, తదితరులు పాల్గొన్నారు.