Coal production | రామగిరి జూన్ 30: సింగరేణి సంస్థలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో బొగ్గు ఉత్పత్తిని వెలికి తీసే పక్రియ కొనసాగుతుందని అర్జీ-3జీ ఎం నరేంద్ర సుధాకర రావు తెలిపారు. అర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు లో రూ.4.91 కోట్లతో కొనుగోలు చేసిన 6.5క్యూబిక్ మీటర్ల సామార్థ్యం గల షావెల్ యంత్రాన్ని సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి, సమష్టి కృషితో ఉత్పత్తి లక్ష్యాలను సాధించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ సీహెచ్ వెంకటరమణ, ఏరియా ఇంజినీర్ వైవీ శేఖరబాబు, ప్రాజెక్ట్ ఇంజనీర్ చంద్రశేఖర్, మేనేజర్ కేవీ రామారావు, బీఈఎంఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.