వేములవాడ, మార్చి 3: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 7న వేములవాడకు రానున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సన్నిధిలో శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయనున్నారని చెప్పారు. అనంతరం గుడి చెరువు వద్ద గల 30 ఎకరాల్లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారని వెల్లడించారు.
ఆదివారం ఆయన కలెక్టర్ అనురాగ్‌జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, రాజన్న ఆలయ ఈవో కృష్ణప్రసాద్, సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డితో కలిసి సభాస్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను రెండురోజుల్లోగా వెల్లడిస్తామని పేర్కొన్నారు.