కాంగ్రెస్ వచ్చింది.. రైతులను ముంచింది
రాష్ట్రంలో పాలన బ్రహ్మాండంగా సాగుతున్న టైంలో ఆచరణకు సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతులు సహా సబ్బండవర్గాలను నిండా ముంచిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు.
- ధాన్యం కొనుగోళ్లలో ఇన్ని ఇబ్బందులు పెడుతరా..?
- రైతు ఏడుపు రాష్ర్టానికి మంచిది కాదు
- రేవంత్‌రెడ్డికి గుణపాఠం తప్పదు
- రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
అంతర్గాం, మే 16: రాష్ట్రంలో పాలన బ్రహ్మాండంగా సాగుతున్న టైంలో ఆచరణకు సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతులు సహా సబ్బండవర్గాలను నిండా ముంచిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో అనేక ఇబ్బందులు పెడుతున్నదని, రైతును ఏడిపించడం రేవంత్‌కు సరదాగా కావచ్చుగానీ, రైతు ఏడుపు రాష్ర్టానికి మంచిదికాదని చెప్పారు.
కేంద్రాలలో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం పెద్దంపేట కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, మాట్లాడారు. నాడు కాంగ్రెస్ పుణ్యమాని వ్యవసాయ భూములు అమ్ముకొని పట్టణాలకు వలస వెళ్లిన రైతులు, బీఆర్ఎస్ హయాంలో మళ్లీ పల్లెలకు వచ్చి బతికారని వివరించారు. కేసీఆర్ రైతును రాజుగా చేస్తే, రేవంత్ రాచిరంపాన పెడుతున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ‘దోచుకో..దాచుకో’ అనే విధంగా సాగుతున్నదని, రైతులను ఆదుకునే ధ్యాసే లేదని ఆక్షేపించారు. మిల్లర్లతో మిలాఖతై ధాన్యం బస్తాల్లో కోత విధించడం దారుణమని, రైతు జీవితాలతో ఆడుకుంటున్న రేవంత్‌కు రాబోయే రెండేళ్లలో తగిన గుణపాఠం చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇక్కడ నాయకులు గోపు ఐలయ్య, శ్రీనివాస్‌రెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్, కొలిపాక మధుకర్‌రెడ్డి, కోల సంతోష్, సర్పంచ్ అముల పెద్ద శ్రీనివాస్, బండారి ప్రవీణ్, దొమ్మటి వాసు, మహేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

