ధర్మారం/ ధర్మపురి ఫిబ్రవరి 17: ‘సీఎం కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష. ఆ యన హాయాంలోనే తెలంగాణలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందినయ్. సబ్బండ జనులకు సమ న్యాయం జరిగింది. దార్శనికుడి పాలన కోసం దేశజనం ఎదురుచూస్తున్నది..’ అంటూ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం తెలంగాణలోని 4 కోట్ల ప్రజానీకానికి పండుగ దినమని అభివర్ణించారు.
ఆయన వందేండ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మా రం, జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన సీఎం కేసీఆర్ 69వ జన్మదినోత్సవాలకు అమాత్యుడు హాజరయ్యారు. ఆయాచోట్ల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో 69 కిలోల కేక్‌ను కట్ చేసి పరస్పరం తినిపించుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. అం తకుముందు ధర్మారంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేశారు. ‘జై కేసీఆర్..జై జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. మహిళలు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించారు.
ఆయాచోట్ల కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. ప్రాణాలకు తెగించి రాష్ర్టాన్ని సాధించిన ఆయన అనతికాలంలోనే తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఎనిమిదేండ్లలో నిధులు, నీళ్లు తెచ్చి, నియామకాలు చేపట్టి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని చెప్పారు. మూడేండ్లలోనే బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. 2.42 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారని చెప్పారు. అనేక నీటిపారుదల ప్రాజెక్టులను కట్టి, మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించి తెలంగాణలోని బీడుభూములను పునీతం చేశారని పేర్కొన్నారు. 24 గంట ల కరెంట్‌తో రైతుల బతుకుల్లో వెలుగులు నింపారని ప్రశంసించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు భరోసానిచ్చారన్నారు.
ఒక్క రూపాయి ఇ వ్వబోమని సమైక్య పాలకులు అవహేళన చేసిన చోటే రూ. 2.96 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా సర్కారు దవాఖానల్లో ప్రసవం చేయించుకున్న మహిళలకు కేసీఆర్ కిట్‌ను అందిస్తున్నారన్నా రు. పాలనా సంస్కరణలు చేపట్టి కొత్త జిల్లా లు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేసి ప్రజలకు పాలనను చేరువచేశారని చెప్పా రు. ధర్మారంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, నందిమేడారం ప్యాక్స్ చైర్మన్ బలరాంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో జడ్పీటీసీ పూస్కూరు పద్మజ జితేందర్‌రావు, ధర్మారం సర్పంచ్ పూస్కూరు జితేందర్‌రావు, పత్తిపాక ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్లు బుచ్చిరెడ్డి, చంద్రయ్య, వైస్ ఎంపీ పీ తిరుపతి, ఎంపీటీసీ రాంబాబు, నాయకులు పాకాల రాజయ్య, ఆవుల లత, బాస తిరుపతిరావు, డీ లావణ్య, శ్రీనివాస్, డీ తిరుపతి, ఎన్ శ్రీనివాస్ మిట్ట తిరుపతి, జీ మోహన్‌రెడ్డి, ఎం శ్రీనివాస్, కనకలక్ష్మి, స్వామి, మల్లేశం, హఫీజ్, నళినీకాంత్, వంశీక్రిష్ణ, మ ల్లేశం ఉన్నారు. ధర్మపురిలో కరీంనగర్ డీసీఎమ్మెస్ చైర్మన్ డా. శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అ య్యోరి రాజేశ్‌కుమార్, మండల ఆర్బీఎస్ కన్వీనర్ సౌళ్ల భీమయ్య, పీఏసీఎస్ చైర్మన్ సౌళ్ల నరేశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్‌కుమార్, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు వేణు, అశోక్, విజయలక్ష్మి, ఉమాలక్ష్మి, నేతలు సంగి శేఖర్, చిలివేరి శ్యాంసుందర్, ఇనుగంటి వెంకటేశ్వరరావు, వొడ్నాల మల్లేశం, సాంబమూర్తి ఉన్నారు.