జగిత్యాల కలెక్టరేట్, నవంబర్ 24: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జగిత్యాలలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాబోతున్నారు.
నియోజకవర్గ కేంద్రం జగిత్యాలలోని గీత విద్యాలయం మైదానంలో సభ నిర్వహించనుండగా, ఏర్పాట్లను ఎమ్మెల్సీ, జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి ఎల్ రమణ, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత శుక్రవారం పరిశీలించారు.
ఇక్కడ బీఆర్ఎస్ జగిత్యాల రూరల్ మండలాధ్యక్షుడు బాలముకుందం, ప్యాక్స్ చైర్మన్లు మహిపాల్‌రెడ్డి, సందీప్‌రావు, నాయకులు దావ సురేష్, నక్కల రవిందర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, రాంమోహన్‌రావు, ఆసీఫ్, శరత్, ఉత్తమ్, సుమన్‌రావు ఉన్నారు.