Korutla | కోరుట్ల, ఫిబ్రవరి 3 : కోరుట్ల పట్టణంలోని మండల వనరుల కేంద్రంలో మంగళవారం మండల విద్యాధికారి గంగుల నరేశం ఆధ్వర్యంలో వ్యాయమ ఉపాధ్యాయులతో సీఎం కప్ క్రీడా పోటీల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
క్రీడా పోటీలకు కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల నుంచి ఎంపికైన క్రీడాకారులు పాల్గొనేలా వ్యాయామ ఉపాధ్యాయులు బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఈనెల 5న ఖోఖో, కబడ్డీ, 6న వాలీబాల్, అథ్లెటిక్స్, 7న చెస్, బ్యాట్మింటన్, యోగ పోటీలు జరుగుతాయని తెలిపారు. సమావేశంలో పేటా సెక్రటరీ అశోక్, వ్యాయమ ఉపాధ్యాయులు విజయ్, మహిపాల్, శ్రీకాంత్, అజయ్, లక్ష్మణ్, దివ్య, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.